Thursday, 15 May 2025 02:40:24 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

తెలుగు రాష్ట్రాల్లో స్థూలకాయంతో ఎంత మంది బాధపడుతున్నారో తెలుసా?

Date : 22 July 2024 03:51 PM Views : 165

Studio18 News - జాతీయం / : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే 2023-24ను విడుదల చేశారు. పలు అంశాలతో పాటు దేశ ప్రజల్లో స్థూలకాయ సమస్య పెరిగిపోతోందన్న విషయాన్నీ ఆర్థిక సర్వే బయటపెట్టింది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య గణనీయంగా పెరిగినట్లు సర్వే తెలిపింది. దేశంలో 18-69 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో చేసిన సర్వేలో ఈ విషయాలు తేలాయని చెప్పింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాలు ప్రకారం.. సగటున 22.9 శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే మహిళల్లో స్థూలకాయం 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. ఢిల్లీ మొదటి స్థానంలో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో మహిళల్లో ఇది 41.3 శాతం, పురుషుల్లో 38 శాతం ఉంది. ఏపీలో స్థూలకాయంతో బాధపడుతున్న మహిళలు 36.3 శాతం, పురుషులు 31.1 శాతం మంది ఉన్నారు. తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.3 శాతం మంది ఉన్నారు. తమిళనాడులో 37 శాతం పురుషులు, 40.4 శాతం మహిళల్లో స్థూలకాయం ఉంది. పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయం పెరిగింది. కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో పరిమిత స్థాయిలో శారీరక శ్రమ వల్ల ఇది గణనీయంగా పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :