Sunday, 15 March 2026 11:10:56 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Viral Pic: హృదయాన్ని ద్రవింపజేస్తున్న తండ్రీకూతుళ్ల స్టోరీ

Date : 05 September 2024 11:16 AM Views : 387

Studio18 News - జాతీయం / : తల్లిలేని బిడ్డను పెంచడానికి తండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే చోటుకి కూడా బిడ్డను తీసుకుపోతుంటారు కొందరు. ఇటువంటి తండ్రి కథనే ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లోని స్టార్‌బక్స్ అవుట్‌లెట్ మేనేజర్ దేవేంద్ర మెహ్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకుని ఫుడ్ డెలివరీ చేస్తున్నాడని తెలిపారు. జొమాటో డెలివరీ పనిలో భాగంగా అతడు ఫుడ్ తీసుకెళ్లడానికి తమ స్టార్‌బక్స్ అవుట్‌లెట్లోకి వచ్చాడని, ఆ సమయంలో అతడితో పాటు అతడి బిడ్డను చూశామని చెప్పారు. అతడి పాపకు ఉచితంగా బేబీకినో ఇచ్చామని అన్నారు. “ఇవాళ ఓ జొమాటో డెలివరీ బాయ్ మా స్టోర్‌కి ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు. అతను మా హృదయాన్ని గెలుచుకున్నాడు. అతడు తనతో పాటు తన రెండేళ్ల కుమార్తెను చూసుకుంటూ కష్టపడి పని చేస్తున్నాడు’’ అని మెహ్రా చెప్పారు. అతడు తన కూతురి పట్ల చూపుతున్న ప్రేమ స్ఫూర్తివంతంగా ఉందని అన్నారు. అందుకే తాము ఆ పాపకు చిరు బహుమతిగా ఆమె ముఖంలో ఆనందం నింపే ప్రయత్నంలో బేబీకినో ఇచ్చామని తెలిపారు. ఆ డెలివరీ బాయ్ పేరు సోనూ అని చెప్పారు. దేవేంద్ర షేర్ చేసిన సోనూ, అతడి కుమార్తె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :