Sunday, 08 March 2026 10:43:48 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Waqf Bill: లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు... విపక్షాల డిమాండ్‌తో జేపీసీకి బిల్లు!

Date : 08 August 2024 04:45 PM Views : 374

Studio18 News - జాతీయం / : కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలపగా, కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. వైసీపీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాల డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. దీనిని జేపీసీకి పంపిస్తామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు బిల్లును తీసుకువచ్చారు. దీని ద్వారా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పాదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయనున్నారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ సవరణలు చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. సచార్ కమిటీ సిఫార్సులోని అంశాలనే బిల్లులో పొందుపరిచినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. 1976లోని ఎంక్వయిరీ రిపోర్ట్ వక్ఫ్ బోర్డులోని అక్రమాలను బయటపెడుతోందన్నారు. వక్ఫ్ బోర్డులకు రావాల్సిన ఆదాయం సరిగ్గా రావడం లేదన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయాలపై అందరికీ అవగాహన ఉందన్నారు. అయితే, ఈ బిల్లు దారుణమైనదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :