Thursday, 15 May 2025 02:57:33 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Rajya Sabha: కీలక పరిణామం.. రాజ్యసభలో మెజారిటీ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ

Date : 28 August 2024 12:10 PM Views : 149

Studio18 News - జాతీయం / : పెద్దల సభ అయిన రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్‌ను విజయవంతంగా దాటింది. రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా ప్రస్తుతం 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో జమ్మూకశ్మీర్‌లో 4, మరో నాలుగు నామినేటెడ్ స్థానాలుగా ఉన్నాయి. ఇటీవల కొత్త సభ్యుల ఎన్నిక తర్వాత.. ఖాళీగా ఉన్న 8 స్థానాలను మినహాయిస్తే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 237గా ఉంది. ఇక మెజారిటీ సంఖ్య 119గా ఉంది. కొత్త సభ్యుల ఎన్నికతో ఎన్డీఏ ఈ ఫిగర్‌ను విజయవంతంగా దాటింది. ప్రస్తుతం ఎన్డీయే సభ్యుల సంఖ్య 121గా ఉంది. దీంతో పార్లమెంటు ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం అయింది. ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కొత్తగా 9 మంది సభ్యులను ఏకగ్రీవంగా గెలిపించుకోవడంతో సభలో బీజేపీ సంఖ్యా బలం 96కి పెరిగింది. ఎన్డీయే బలం 121, ప్రతిపక్షాల సభ్యుల సంఖ్య 85కి చేరుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :