Monday, 23 June 2025 02:20:58 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

రెడ్ హ్యాండెడ్‌గా భార్య, ఆమె ప్రియుడిని పట్టుకున్న భర్త.. చివరికి వారిద్దరికీ పెళ్లి చేసి..

Date : 05 August 2024 04:58 PM Views : 131

Studio18 News - జాతీయం / : తన భార్య పరాయి మగాడిని చూస్తేనే ఆమెపై భర్త దాడికి దిగడం, విడాకులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్న రోజులు ఇవి. అటువంటిది తన భార్య తనను మోసం చేస్తూ, తన కళ్లుగప్పి ఆమె ప్రియుడితో ఉండడాన్ని గుర్తించినప్పటికీ ఓ భర్త గొప్ప మనసు చాటుకున్నాడు. ఆమె ఎక్కడ ఉన్నా సుఖసంతోషాలతో ఉండాలని, ఆమెను విడిచి వెళ్లాడు. తన భార్యకు ఆమె ప్రియుడితో దగ్గరుండి పెళ్లి చేసి పంపాడు. బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లా రామ్‌నగర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల రాజేశ్ కుమార్ అనే వ్యక్తి దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. తన భార్య, ఆమె ప్రియుడు ప్రేమాయణం కొనసాగిస్తుండడంతో వారి వివాహానికి తాను అంగీకరించినట్లు చెప్పారు. రాజేశ్ కుమార్ భార్య పేరు ఖుష్బూ కుమారి (22). రాజేశ్ కుమార్‌, ఖుష్బూ వివాహం 2021లో జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి కాక ముందే చందన్ కుమార్ (24) అనే వ్యక్తితో ఖుష్బూ ప్రేమాయణం కొనసాగించింది. రాజేశ్‌తో పెళ్లి జరిగినప్పటికీ చందన్‌ను కలుస్తూనే ఉంది. ఇటీవల రాత్రి ఇంట్లో ఎవరూ లేని వేళ ఖుష్బూను కలిసేందుకు చందన్ కుమార్ వచ్చాడు. అర్ధరాత్రి వేళ పని అయిపోవడంతో రాజేశ్ కుమార్ ఇంటికి వచ్చాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కొనసాగిస్తున్న వ్యవహారాన్ని గుర్తించాడు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో వారి సంబంధం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతి రోజే చందన్, ఖుష్బూను తీసుకుని గ్రామ పెద్దల వద్దకు వెళ్లాడు రాజేశ్. తన భార్యకు, ఆమె ప్రియుడికి పెళ్లి చేస్తానని చెప్పాడు. తన రెండేళ్ల కుమారుడిని మాత్రం తన వద్దే పెంచుతానని తెలిపాడు. తన భార్య, చందన్ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. తన భార్యకు, ఆమె ప్రియుడికి పెళ్లి చేసి పంపి, తన దారి తాను చూసుకున్నాడు రాజేశ్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :