Sunday, 08 March 2026 04:08:30 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Rahul Gandhi: నాపై దాడికి ఈడీ ప్లాన్ చేసింది: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Date : 02 August 2024 01:26 PM Views : 411

Studio18 News - జాతీయం / : లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జులై 29న పార్లమెంట్‌లో తాను చేసిన ‘చక్రవ్యూహం’ ప్రసంగం అనంతరం తనపై దాడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేసిందని ఆరోపించారు. తనపై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసిందని అన్నారు. చాయ్, బిస్కెట్లతో అధికారుల కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తుంటానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం స్పందించారు. ‘‘నా చక్రవ్యూహ ప్రసంగం ‘2 ఇన్ 1’కు నచ్చలేదు. నాపై దాడికి ప్లాన్ చేసినట్టు ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. ఛాయ్, బిస్కెట్లతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటాను’’ అని అన్నారు. కాగా జులై 29న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024పై రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శల దాడి చేశారు. బీజేపీ పార్టీ కమలం సింబల్‌ను ప్రదర్శించిన ఆయన.. 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం సిద్ధమైందని విమర్శించారు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహంలో బంధించి చంపారని, తాను కొంచెం పరిశోధన చేసి చక్రవ్యూహాన్ని కనిపెట్టానని, 'పద్మవ్యూహం’ అని కూడా పిలవొచ్చని అన్నారు. ‘‘పద్మవ్యూహం అంటే 'కమలం ఏర్పడటం'. 21వ శతాబ్దంలో ఒక కొత్త 'చక్రవ్యూహం' ఏర్పడింది. అభిమన్యుడి మాదిరిగా భారతదేశంలోని యువకులు, రైతులు, మహిళలు, చిన్న-మధ్యతరహా వ్యాపారులు నేడు ఆరుగురు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. చక్రవ్యూహంలో ఆరుగురు వ్యక్తులు నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ’’ అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :