Studio18 News - జాతీయం / : FASTag New Guidelines : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం.. టోల్ చెల్లింపులను సులభతరం చేయడం, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంకోసం వీలుంటుంది. అయితే.. కొత్తరూల్స్ కు ఎన్పీసీఐ మార్గదర్శకాల ప్రకారం.. మీ ఫాస్ట్‌ట్యాగ్ మూడు నుండి ఐదు సంవత్సరాల క్రితం జారీ చేయబడినది అయితే వారు కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి. మీ ఫాస్ట్‌ట్యాగ్ ఐదు సంవత్సరాల క్రితం జారీచేయబడినది అయితే వారు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాలి. కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు 90 రోజుల్లో వాహన నెంబర్ ను పాస్ట్ ట్యాగ్ డేటాబేస్ లో నమోదు చేయించుకోవాలి. వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్‌లు ఫాస్ట్‌ట్యాగ్‌తో అనుసంధానించబడి ఉన్నాయాలేదా అని నిర్ధారించుకోవాలి. వాహనం ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఫొటో అప్లోడ్ చేయాలి. ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ తో కనెక్ట్ చేసుకోవాలి. కొత్తరూల్స్ కు రవాణా శాఖ అక్టోబర్ 31 వరకు సమయం ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని రిజిస్టర్ చేయించుకోకపోతే టోల్ గేట్ వద్ద వాహనదారులు పలు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
Admin
Studio18 News