Thursday, 05 December 2024 03:09:50 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ఒక్కరోజు నా స్థానంలో కూర్చుంటే తెలుస్తుంది..! సుప్రీంకోర్టు న్యాయవాదులపై సీజేఐ తీవ్ర అసహనం

Date : 06 August 2024 01:42 PM Views : 40

Studio18 News - జాతీయం / : Chief Justice DY Chandrachud : పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్థం చేసుకోవాలని అన్నారు. న్యాయవాదులు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే ఎంత ఒత్తిడితో పని చేస్తున్నామో అని తెలుస్తుందని అన్నారు. ఒక్కసారి కూర్చుంటే మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారుని సీజేఐ వ్యాఖ్యానించారు. ముంబై చెంబుర్‌ కాలేజీలో విద్యార్ధినిలు బురఖా, హిజాబ్‌ రద్దు చేసిన వ్యవహారంపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కానీ, న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని సీజేఐ అన్నారు. ప్రతిఒక్క పిటిషన్‌పై విచారణ చేస్తాము.. దానికి ఒక తేదీ ఇస్తాము.. కానీ న్యాయమూర్తులను, కోర్టును శాసించవద్దు అంటూ జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. ఏక్ నాథ్ షిండే గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి మహారాష్ట్ర స్పీకర్ నిరాకరించినందుకు వ్యతిరేకంగా శివసేన (యుబిటి) దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలని న్యాయవాది కోరారు. ఈరోజు ఈ అంశం జాబితా చేయబడినప్పటికీ ధర్మాసనం పాక్షికంగా విని మరో అంశాన్ని విచారిస్తున్నందున అది తీసుకోలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ముందస్తు విచారణ తేదీ కావాలని న్యాయవాది అభ్యర్థించారు. ప్రతివాదులు డాక్యుమెంట్ల సంకలనానికి సమయం కావాలని కోరడంతో కోర్టు వచ్చే గురువారం వరకు గడువు ఇచ్చింది. మూడు రోజుల్లో సంకలనాన్ని రూపొందించవచ్చునిన న్యాయవాది ముందస్తు తేదీ కోరినప్పుడు సీజేఐ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :