Studio18 News - జాతీయం / : కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (69) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నైగావ్ వసంత్ చవాన్ స్వస్థలం. 2002లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు నైగావ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం నాందేడ్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. 2021 నుంచి 2023 వరకు రెండేళ్లపాటు నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖాలికర్‌ను ఆయన 59,442 ఓట్ల తేడాతో ఓడించారు. వసంత్ చవాన్ అంత్యక్రియలు స్వగ్రామమైన నైగావ్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Admin
Studio18 News