Monday, 23 June 2025 02:47:31 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Rajinikanth: గడ్డం నెరిసి, పళ్లు ఊడిపోయినా నటిస్తూనే ఉంటారు: రజనీకాంత్ కు తమిళనాడు మంత్రి చురక

Date : 26 August 2024 05:03 PM Views : 134

Studio18 News - జాతీయం / : తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్ పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. కొందరు పెద్ద నటులు వయసు పెరిగి, గడ్డం నెరిసి, పళ్లు ఊడిపోయి, చావబోయే స్థితిలో కూడా సినిమాలు చేస్తూనే ఉంటారని రజనీకాంత్ కు దురై మురుగన్ చురక అంటించారు. ఇలాంటి వృద్ధ నటుల వల్ల కొత్త నటులకు అవకాశాలు రాకుండా పోతున్నాయని తెలిపారు. రజనీకాంత్ అంతటివాడిని మంత్రి దురై మురుగన్ టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. శనివారం నాడు జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు దురై మురుగన్ కు ఆగ్రహం తెప్పించాయి. ఇంతకీ రజనీ ఏమన్నారంటే... "ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. స్కూల్లో కొత్త విద్యార్థులను మేనేజ్ చేయడం ఏమంత కష్టం కాదు. కానీ వచ్చిన చిక్కంతా పాత విద్యార్థులతోనే. ఇక్కడ (డీఎంకేలో) చాలామంది పాత విద్యార్థులు ఉన్నారు. పైగా వాళ్లేమీ సాధారణ విద్యార్థులు కాదు... ఎవరికి వారే అసాధారణమైన పాత విద్యార్థులు! వీళ్లంతా కూడా ర్యాంకులు తెచ్చుకుంటుంటారు.... కానీ తరగతి గదిని మాత్రం విడిచిపోరు. సరిగ్గా చెప్పాలంటే... దురై మురుగన్ కూడా అలాంటి పాత విద్యార్థే. ఇంతకుమించి ఇంకేం చెప్పగలం. అయితే, స్టాలిన్ సర్ (సీఎం)... మీరు పాత విద్యార్థులను కూడా అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు... మీకు హ్యాట్సాఫ్" అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి దురై మురుగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. "సరిగ్గా ఇలాంటి పరిస్థితే చిత్రసీమలో కూడా ఉంది. గెడ్డాలు పెరిగిపోయి, పళ్లూడిపోయి బోసి నోటితో కూడా నటించే ముసలి నటులు ఉన్నప్పుడు యువ కళాకారులు అవకాశాలు కోల్పోతున్నారని మేం కూడా చెప్పగలం" అని కౌంటర్ ఇచ్చారు. దురై మురుగన్ తనపై సెటైర్ వేయడాన్ని రజనీకాంత్ తేలిగ్గా తీసుకున్నారు. దురై మురుగన్ తన గురించి మాట్లాడిన మాటలను తాను పట్టించుకోబోనని, తామిద్దరం ఎప్పటి నుంచో స్నేహితులమని, తమ స్నేహం ఇక ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాంతో, దురై మురుగన్ మళ్లీ స్పందించారు. తాను కూడా అదే చెబుతానని, తమ జోకులను ఎవరూ శత్రుత్వంగా భావించరాదని స్పష్టం చేశారు. రజనీకాంత్, తాను ఎప్పటికీ స్నేహితులమేనని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :