Monday, 23 June 2025 03:04:18 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Zomato delivery Boy: ముంబై స్లమ్‌ ఏరియాలో రూ.500 అద్దె రూమ్.. జొమాటో డెలివరీ బాయ్ వీడియో వైరల్

Date : 24 July 2024 05:55 PM Views : 185

Studio18 News - జాతీయం / : ముంబై మహానగరంలోని స్లమ్ ఏరియాలో నివసించేవారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో తెలియజేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రంజయ్ బోర్గోయరీ అనే జొమాటో డెలివరీ బాయ్ నెలకు కేవలం రూ.500 అద్దె చెల్లిస్తూ ఇరుకైన రూమ్‌లో నివాసం ఉంటున్నాడు. మరో స్నేహితుడితో కలిసి ఈ రూమ్‌ను షేర్ చేసుకుంటున్నాడు. వీరిద్దరికి తోడు ఒక పిల్లి కూడా ఆ అద్దె గదిలో ఉంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రంజయ్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేశాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ప్రంజయ్ తన వ్యథలను పంచుకున్నాడు. ఈశాన్య భారతదేశం నుంచి ముంబైకి వలస వచ్చానని, నెలకు కేవలం రూ.500 చెల్లించి మరొక వ్యక్తితో కలిసి ఇరుకైన గదిలో నివసిస్తున్నట్టు చెప్పాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన కోసం ఇంట్లో వాళ్లు కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ అతడు సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాడు. ఇక సింగర్‌గా, ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రాణించాలని భావిస్తున్నానని చెప్పాడు. తన మ్యూజిక్‌కు సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌లో అతడు షేర్ చేశాడు. కాగా ప్రంజయ్ షేర్ చేసిన వీడియోకు 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు చాలా నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఖుషీ అనే ఓ వ్యక్తి మూడు నెలల అద్దె డబ్బులు సాయంగా అందించాడు. జీవితం మెరుగుపడుతుందని, మెరుగైన జీవితాన్ని త్వరగా పొందాలంటూ పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కొరియన్ పాప్ స్టార్లతో పోల్చిన మరికొందరు మోడలింగ్ రంగంలో ప్రయత్నించాలంటూ సూచనలు చేశారు. ప్రంజయ్ కథను చూసి కష్టాల్లో ఉన్నవారు కూడా ప్రేరణ పొందవచ్చునని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రోత్సాహం పొందవచ్చునని వ్యాఖ్యానించారు. కాగా ఈ వీడియో ముంబైలోని స్లమ్ ఏరియాలో జీవించేవారి దుర్భర పరిస్థితికి అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ప్రంజయ్ మాదిరిగా చాలా కనీసం అవసరమైన నివాసం కోసం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఈ వీడియోను సాక్ష్యమని వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :