Studio18 News - జాతీయం / : Delhi AC Falls Down Incident: రెప్పపాటులో జరిగిపోయింది. క్షణాల్లో ప్రాణం పోయింది. అనూహ్య ప్రమాదానికి 18 ఏళ్ల యువకుడు బలైపోయాడు. స్నేహితుడితో మాట్లాడుతుండగానే అతడికి అంతిమ ఘడియలు సమీపించాయి. మృత్యుపాశంలా దూసుకొచ్చిన ఏసీ యూనిట్ ఏకంగా ఓ కుర్రాడి ప్రాణాలు తీసుకుపోయింది. ఈ అనూహ్య విషాద ఘటన ఢిల్లీ వాసులను వణికించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. అసలేం జరిగింది? అది ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్డులోని డోరివాలా ప్రాంతం. ఆదివారం సాయంత్రం 6:40 గంటల టైమ్‌లో గల్లీలో 18 ఏళ్ల జితేష్ స్కూటర్‌పై కూర్చొని తన ఫ్రెండ్ ప్రన్షుతో కబుర్లు చెబుతున్నాడు. మరో వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ అటుఇటు తిరుగుతున్నాడు. స్పేహితుడి నుంచి వీడ్కోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లేందుకు రెడీ అవుతుండగా హఠాత్ పరిణామం చోటుచేసుకుంది. రెండో అంతస్థు నుంచి వేగంగా విండో ఏసీ నేరుగా జితేష్‌పై పడింది. అంత బరువైన ఏసీ యూనిట్ మీద పడడంతో జితేష్ కుప్పకూలిపోయాడు. స్పాట్ లో ప్రాణాలు వదిలాడు. ప్రన్షు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రన్షు పటేల్ నగర్ వాసిగా పోలీసులు గుర్తించారు.
Admin
Studio18 News