Sunday, 08 February 2026 11:01:37 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Jagdeep Dhankhar: రాజ్యసభలో నవ్వులు పూయించిన జ‌యా బ‌చ్చ‌న్ .. వీడియో వైర‌ల్‌!

Date : 03 August 2024 12:32 PM Views : 279

Studio18 News - జాతీయం / : ఇటీవల రాజ్యసభలో జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్ మాట్లాడాలంటూ.. డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ పిలిచారు. ఆ స‌మ‌యంలో జ‌యా బ‌చ్చ‌న్ అస‌హ‌నానికి లోన‌య్యారు. తనను కేవ‌లం జ‌యా బ‌చ్చ‌న్ అని పిలిస్తే స‌రిపోతుంద‌న్నారు. మహిళలకు ప్ర‌త్యేక గుర్తింపు అంటూ లేదా? అని ఆమె ప్ర‌శ్నించారు. అయితే, ఇలా త‌న‌ను భ‌ర్త పేరుతో క‌లిపి పిల‌వ‌డానికి అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ రోజుల వ్య‌వ‌ధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్య‌స‌భ‌లో శుక్ర‌వారం కాసేపు సరదాగా న‌వ్వులు పూయించారు. స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్ మాట్లాడుతూ నిన్న మాట్లాడుతూ.. త‌న భ‌ర్త అమితాబ్ పేరుతో క‌లిపి 'జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్' అని తనను ప‌రిచ‌యం చేసుకున్నారు. దాంతో మొన్నటి ఘటన గుర్తొచ్చి, చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ ఒక్క‌సారిగా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఆ సంద‌ర్భంలో ఎంపీలు ‌జైరామ్ ర‌మేశ్‌, రాఘ‌వ చ‌ద్దాలు కూడా నవ్వుతూ సరదాగా స్పందించారు. "మీరు లంచ్ బ్రేక్ తీసుకున్నారా? లేదా?.. అందుకే జైరామ్ ర‌మేశ్ పేరును ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నార‌ని ధ‌న్‌క‌ర్‌ను ఉద్దేశిస్తూ జ‌యా అన్నారు. 'ఆయ‌న పేరు చెప్ప‌కపోతే మీకు తిన్న‌ది అర‌గ‌దేమో' అంటూ సరదాగా చురక కూడా అంటించారు. ఆ స‌మ‌యంలో ధ‌న‌క‌ర్ స్పోర్టివ్ గా స్పందిస్తూ.. ఇవాళ లంచ్ బ్రేక్ తీసుకోలేద‌ని, కానీ జైరామ్ తో కలిసి లంచ్ మాత్రం చేశాన‌ని చమత్కరించారు. దాంతో ఛైర్మ‌న్ మాటలు కూడా సభలో నవ్వులు పూయించాయి. ఇక జులై 29న రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తనను 'జయా అమితాబ్ బచ్చన్' అని సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. '"సార్, జయా బచ్చన్ అంటే సరిపోతుంది అని ఆమె చెప్పారు. "మహిళలు తమ భర్తల పేరుతో గుర్తించబడతారు. వారికి (మహిళలకు) వారి సొంత ఉనికి లేదా?" అని ఆమె అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :