Wednesday, 25 June 2025 08:05:33 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Robert Vadra: కంగనా రనౌత్ పై నిప్పులు చెరిగిన రాబర్ట్ వాద్రా

Date : 31 August 2024 03:25 PM Views : 134

Studio18 News - జాతీయం / : రైతుల ఆందోళనలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. కంగనకు పార్లమెంటులో ఉండే కనీస అర్హత కూడా లేదని ఆయన అన్నారు. ఒక మహిళగా కంగనను తాను గౌరవిస్తానని... కానీ ఎంపీగా ఉండే అర్హత మాత్రం ఆమెకు లేదని చెప్పారు. ఆమె ఎప్పుడూ ఆమె గురించి మాత్రమే ఆలోచిస్తుందని... మహిళల గురించి కూడా ఆమె ఆలోచించాలని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ... రైతుల ఉద్యమం వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. బంగ్లాదేశ్ వంటి పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం జరిగి ఉండొచ్చని... కానీ మన దేశ బలమైన నాయకత్వం కారణంగా అది జరగలేదని చెప్పారు. రైతుల ఉద్యమం పేరుతో హింస చెలరేగిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై రాబర్ట్ వాద్రా కూడా విమర్శలు గుప్పించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :