Studio18 News - జాతీయం / : Buddhadeb Bhattacharjee Passed Away: ప్రముఖ లెఫ్ట్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) కన్నుమూశారు. దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడ్డారు. గతేడాది న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భట్టాచార్య కన్నుమూశారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. జ్యోతిబసు తర్వాత సీఎంగా ఎన్నికైన బుద్ధదేవ్ 11 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. సీపీఎం అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన పొలిట్‌బ్యూరోలోనూ ఆయన సభ్యుడిగా సేవలు అందించారు.
Admin
Studio18 News