Sunday, 08 March 2026 04:41:38 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Fake NCC Camp: ఎన్ సీసీ క్యాంప్ పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు.. తమిళనాడులో ఘటన

Date : 19 August 2024 01:53 PM Views : 393

Studio18 News - జాతీయం / : తమిళనాడులో ఓ ప్రైవేటు స్కూలులో ఫేక్ ఎన్ సీసీ క్యాంపు పెట్టి పదమూడు మంది బాలికలను దుండగులు లైంగికంగా వేధించారు. క్యాంపు ఏర్పాటు చేస్తే ఎన్ సీసీ గుర్తింపు లభిస్తుందని చెప్పిన దుండగుల మాటలకు స్కూలు యాజమాన్యం బోల్తా పడింది. ఎవరినీ విచారించకుండానే క్యాంప్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం, నిర్వహణ మొత్తం దుండగులకే వదిలివేయడంతో బాలికలు వేధింపులకు గురయ్యారు. క్యాంప్ పూర్తయిన తర్వాత బాలికలు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా.. విషయాన్ని పెద్దది చేయొద్దంటూ వారిని బెదిరించారు. గత నెలలో కృష్ణగిరిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పిల్లల తల్లిదండ్రులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు స్కూలు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఇద్దరు టీచర్లతో పాటు క్యాంప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్కూలులో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఎన్ సీసీ క్యాంపులో 17 మంది బాలికలు సహా మొత్తం 41 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. ఇందులో బాలికలకు స్కూలు ఫస్ట్ ఫ్లోర్ లో, బాలురకు గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ నిర్వాహణకు పర్మిషన్ ఇచ్చిన స్కూలు యాజమాన్యం.. ఆ తర్వాత ఎలాంటి పర్యవేక్షణ చేబట్టలేదు. క్యాంప్ బాధ్యతలు మొత్తం దుండగులకే అప్పగించింది. దీంతో బాలికలను ఆడిటోరియంలోకి పిలిచి వేధింపులకు పాల్పడ్డారు. క్యాంప్ ముగిసిన తర్వాత జరిగిన విషయాన్ని బాలికలు తమ టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన ప్రిన్సిపాల్ కూడా క్యాంప్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవాలని బాలికలను బెదిరింపులకు గురిచేశారు. విషయం బయటపడడంతో పోలీసులు మొత్తం 11 మందిపై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎన్ సీసీ క్యాంపు పేరుతో దుండగులు మిగతా స్కూళ్లలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ పి థంగదురై మీడియాకు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :