Studio18 News - జాతీయం / : ఓ వైపు మాక్ డ్రిల్స్.. మరోవైపు నిజంగానే బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. హరియాణాలోని గురుగ్రామ్‌లోని అన్ని మాల్స్‌కు బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. మాల్స్ నుంచి కస్టమర్లు, సిబ్బందిని ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి పోలీసు అడ్మినిస్ట్రేషన్, డాగ్ స్క్వాడ్, సివిల్ డిఫెన్స్ టీమ్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని గురుగ్రామ్ చీఫ్ సివిల్ డిఫెన్స్ టీమ్ మోహిత్ శర్మ తెలిపారు. ఈ-మెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారని వివరించారు. మరోవైపు, నోయిడాలోని డీఎల్‌ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇవాళ ఉదయం సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. దీనిపై డీసీపీ రామ్ బదన్ సింగ్ మాట్లాడుతూ.. డీఎల్‌ఎఫ్ మాల్‌లో సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించేందుకు ఈ తరహా కసరత్తులు నిర్వహిస్తున్నామని వివరించారు. అగ్నిమాపక, డాగ్ స్క్వాడ్, పోలీసు బృందాలు ఇందులో పాల్గొన్నాయన్నారు. ఒకవేళ ముప్పు పొంచి ఉంటే దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండేందుకు ఈ డ్రిల్స్ నిర్వహించామన్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో ఆర్‌డీఎక్స్ బాంబు ఉందని ఆగస్టు 9న ఒక గుర్తుతెలియని వ్యక్తి ప్రభుత్వ రైల్వే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశాడని అన్నారు. దీంతో తాము సోదాలు నిర్వహించామని, ఏమీ దొరకలేదని అన్నారు.
Admin
Studio18 News