Studio18 News - జాతీయం / : ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. విద్యాసంస్థలు ఈరోజు పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. బృహణ్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు సమీక్షించారు. ఈరోజు మధ్య మహారాష్ట్రలోని కొంకణ్‌లో అత్యంత భారీ వర్షపాతం కురువవచ్చునని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈరోజు ఆర్థిక రాజధానికి రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. దీంతో పాటు ఈరోజు థానే, పాల్ఘర్, పూణే, కొల్హాపూర్, సతారా, రాయ్‌గఢ్, రత్నగిరిలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.
Admin
Studio18 News