Thursday, 05 December 2024 09:07:40 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Gautam Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన‌ అదానీ.. రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అగ్ర‌స్థానం

Date : 29 August 2024 03:27 PM Views : 41

Studio18 News - జాతీయం / : బిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా అవ‌త‌రించారు. తాజాగా వెలువ‌డిన‌ 2024 హురున్ ఇండియా ధ‌న‌వంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెన‌క్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. ఇక రూ. 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. కాగా, అదానీ స్థానం భారతీయ వ్యాపార రంగంలో ఆయన ఆధిపత్య ఉనికిని చాటిందనే చెప్పాలి. ఆయ‌న సంప‌ద ఏడాది కాలంలోనే ఏకంగా 95 శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత‌ శివ్ నాడార్ రూ. 3.14 లక్షల కోట్లతో మూడో స్థానం ద‌క్కించుకున్నారు. అలాగే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ ఎస్. పూనావాలా రూ. 2.89 లక్ష‌ల కోట్ల సంప‌ద‌తో నాలుగో స్థానంలో నిలిచారు. గత ఏడాదిలో మ‌న ద‌గ్గ‌ర‌ ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చిన‌ట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. ఇండియాలో ప్ర‌స్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే 75 మంది పెరిగిన‌ట్లు నివేదిక తెలిపింది. అలాగే 1,539 మంది వ్యక్తులు ఇప్పుడు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 220 మంది పెరిగార‌ని రిపోర్ట్ పేర్కొంది. అంతేగాక‌ సగటు సంపద 25 శాతం మేర‌ పెరిగింది. ఇక రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ సెక్టార్‌లకు చెందిన వారు ఈ బిలియనీర్ల‌ జాబితాలోకి అత్యధికంగా కొత్తగా ప్రవేశించినట్లు నివేదిక వెల్ల‌డించింది. ఇక ధ‌న‌వంతుల‌ జాబితాలో ఉన్న అతి పిన్న వయస్కుడి వయస్సు కేవలం 21 సంవత్సరాలు కావ‌డం గ‌మ‌నార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :