Thursday, 05 December 2024 03:42:16 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Sheikh Hasina: ఎన్నికలు ప్రకటించగానే బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా!.. ఆమె కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 09 August 2024 12:42 PM Views : 40

Studio18 News - జాతీయం / : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్ జాయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం కొత్తగా ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తారని అన్నారు. "ప్రస్తుతానికి ఆమె భారత్‌లో ఉన్నారు. ఎన్నికలు నిర్వహించాలని మధ్యంతర ప్రభుత్వం నిర్ణయిస్తే తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తారు. ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుంది. మేము గెలవొచ్చు కూడా’’ అన్నారు. అమెరికాలో నివసించే సాజీబ్ వాజెద్ జాయ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. కాగా రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్ అట్టుడికిన విషయం తెలిసిందే. వారంరోజుల పాటు కొనసాగిన నిరసనలు తీవ్ర హింసకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. దీంతో ప్రధానమంత్రి పదవికి ఆమె రాజీనామా చేశారు. సోమవారం భారత్‌కు వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. న్యూఢిల్లీలోని ఓ సురక్షిత నివాసంలో షేక్ హసీనా తలదాచుకుంటున్నారని తెలుస్తోంది. బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని ఆమె యోచిస్తున్నట్లు భారతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే బ్రిటన్ హోంశాఖ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలావుంచితే బ్రిటన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం మాట్లాడారు. బంగ్లాదేశ్ పరిస్థితి గురించి వివరించారు. కానీ ఏయే అంశాలపై మాట్లాడారనే విషయాలను మాత్రం బహిర్గతం చేయలేదు. ఇదిలావుంచితే.. నోబెల్ శాంతి అవార్డ్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో గురువారం మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఆయన ప్రమాణస్వీకారం చేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :