Monday, 23 June 2025 01:59:23 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Hema Report: ప్రముఖ మలయాళ సినీ న‌టుడిపై రేప్ కేసు.. హేమ కమిటీ నివేదిక తర్వాత మరో కేసు నమోదు!

Date : 29 August 2024 02:06 PM Views : 230

Studio18 News - జాతీయం / : మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా పలు దిగ్భ్రాంతికర విష‌యాలు బయటకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దాంతో ఈ నివేదిక‌పై ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది. కాగా, క‌మిటీ రిపోర్టు స‌మ‌ర్పించిన త‌ర్వాత బాధితులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి తాము గ‌తంలో ఎదుర్కొన్న వేధింపులను బ‌య‌ట‌పెడుతున్నారు. ఇక ఈ రిపోర్ట్ కార‌ణంగా ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణల నేప‌థ్యంలో 17 కేసుల వరకు నమోదయ్యాయని స‌మాచారం. తాజాగా మరో కొత్త‌ కేసు నమోదైంది. ప్రముఖ న‌టుడు, కేర‌ళ‌లోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసినట్లు అధికారులు వెల్ల‌డించారు. కొచి నగరంలోని మారడు పీఎస్‌లో ఐపీసీ 376(రేప్) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. కాగా, హేమ కమిటీ నివేదిక వ‌చ్చిన‌ తర్వాత మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మలో నమోదైన మూడో హై ప్రొఫైల్ కేసు ఇదే. అంత‌కుముందు నటులు జయసూర్య, మణియం పిళ్ల రాజుపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :