Thursday, 05 December 2024 10:14:12 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Nurse Rape: ఉత్తరాఖండ్ లో నర్స్ పై హత్యాచారం.. 9 రోజుల తర్వాత డెడ్ బాడీ గుర్తింపు

Date : 16 August 2024 12:11 PM Views : 101

Studio18 News - జాతీయం / : కోల్ కతాలో వైద్యురాలిపై జరిగిన ఘోరం తరహాలోనే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ లో ఓ నర్స్ పై అఘాయిత్యం జరిగింది. నర్స్ పై అఘాయిత్యం చేసిన దుండగుడు ఆ తర్వాత ఆమెను చంపేశాడు. బాధితురాలి సోదరి ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు 9 రోజుల తర్వాత మృతదేహం దొరికింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుందీ దారుణం. పోలీసులు, బాధితురాలి బంధువుల వివరాల ప్రకారం.. బిలాస్ పూర్ కు చెందిన ఓ మహిళ ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తోంది. పదకొండేళ్ల కూతురుతో బిలాస్ పూర్ లో ఉంటూ రోజూ రుద్రపూర్ కు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే జులై 30న డ్యూటీకి వెళ్లిన బాధితురాలు రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. బాధితురాలి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆసుపత్రికి ఫోన్ చేయగా సాయంత్రం వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో మరుసటి రోజు ఉదయం బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఓ ఆటోలో బాధితురాలు బయలుదేరడం కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనేది తెలియలేదు. వారం రోజుల తర్వాత బిలాస్ పూర్ లోని బాధితురాలి ఇంటికి సమీపంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందుతుడి కోసం గాలిస్తున్న పోలీసులకు బాధితురాలి ఫోన్ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీకి చెందిన రోజు కూలీ ధర్మేంద్ర దగ్గర దొరికింది. దీంతో ధర్మేంద్రను విచారించగా.. జులై 30న ఆటో దిగి తనుండే అపార్ట్ మెంట్ లోకి వెళుతున్న నర్స్ ను బలవంతంగా పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లానని చెప్పాడు. నర్స్ పై అత్యాచారం చేసి, అనంతరం ఆమె స్కార్ఫ్ తోనే మెడకు బిగించి హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆమె ఫోన్ తో పాటు పర్స్ లో ఉన్న రూ.3 వేలు తీసుకున్నానని వివరించాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :