Studio18 News - జాతీయం / : తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని, కాబట్టి ఎవరూ తనకు ఫోన్ చేయవద్దని ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే ఆదివారం సూచించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'అర్టెంజ్, నా ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయి. దయచేసి నాకు ఎవరూ కాల్ చేయవద్దు. మెసేజ్ చేయవద్దు. ఇందుకు సంబంధించి తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని ట్వీట్ చేశారు. ఫోన్, వాట్సాప్ హ్యాక్ కావడంతో ఆమె ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు సుప్రియా సూలే సన్నిహితులు చెబుతున్నారు. సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి నుంచి ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ కూతురు. ప్రస్తుతం ఎన్సీపీ (శరద్ పవార్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
Admin
Studio18 News