Sunday, 15 March 2026 10:27:47 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

RG kar Hospital: ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై సిట్

Date : 20 August 2024 01:50 PM Views : 385

Studio18 News - జాతీయం / : ట్రెయినీ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి మాజీ చీఫ్ పై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, ఆసుపత్రి మాజీ చీఫ్ సందీప్ ఘోష్ హయాంలో జరిగిన కార్యకలాపాలపై అధికారుల బృందం ఆరా తీయనుంది. మరోవైపు, వైద్యురాలి హత్యాచారం కేసులో సందీప్ ఘోష్ ను సీబీఐ అధికారులు గత నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. ఐజీ ప్రణవ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఆర్జీ కర్ ఆసుపత్రిలో విచారణ జరిపి నెల రోజుల్లోపు నివేదిక సమర్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైన డాక్యుమెంట్లను సిట్ బృందానికి సమర్పించి సిట్ బృందం విచారణకు సహకరించాలంటూ ప్రభుత్వం వివిధ డిపార్ట్ మెంట్లకు నోట్ పంపినట్లు తెలిపాయి. సందీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంటే.. 2021 జనవరి నుంచి ఆయన రాజీనామా చేసిన రోజు వరకు జరిగిన అన్ని ఆర్థిక వ్యవహారాలను సిట్ బృందం పరిశీలించనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :