Studio18 News - జాతీయం / : నేను ఇప్పుడు ఏం చేయాలి? అంటూ బోరున ఏడ్చారు బీజేపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హరియాణాలో అక్టోబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తోంది. తాజాగా ప్రకటించిన జాబితాలో తనకు టిక్కెట్ నిరాకరించడంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. శశి రంజన్ ఈ ఎన్నికల్లో భివానీ, తోషమ్ నుంచి టిక్కెట్ ఆశించారు. చివరకు ఆయనకు పార్టీ అధిష్ఠానం టిక్కెట్ ఇవ్వకపోడంతో దీనిపై స్థానిక మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉంటుందని అనుకున్నానని ఆయన చెప్పారు. అదే సమయంలో కన్నీరు పెట్టుకున్నారు. ఆయనను ఓదార్చడానికి రిపోర్టర్ ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ మాజీ ఎమ్మెల్యే కన్నీరు ఆగలేదు. అభ్యర్థిగా తన పేరు పరిశీలనలో ఉందని తాను ప్రజలకు హామీ ఇచ్చానని, ఇప్పుడు ఏమి చేయాలని ఆయన ప్రశ్నించారు. తాను నిస్సహాయంగా మిగిలిపోయానని తెలిపారు. ‘ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? నా విషయంలో ఏం జరుగుతోంది. నన్ను ఎందుకిలా చూస్తున్నారు? నేను చాలా బాధలో ఉన్నాను’ అని బోరున ఏడ్చారు.
Admin
Studio18 News