Thursday, 05 December 2024 09:00:44 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Mamata Banerjee: కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడికి మరణశిక్ష డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్దకు సీఎం మమత ర్యాలీ

Date : 16 August 2024 12:41 PM Views : 42

Studio18 News - జాతీయం / : జూనియర్ డాక్టర్ హత్యతో కోల్‌కతా అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగానూ దీనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌పై బీజేపీ, సీపీఎం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నేటి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఘటన జరిగిన ఆసుపత్రి వద్దకు ర్యాలీగా వెళ్లనున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలపై ఈ కేసు ఇప్పటికే కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ అయింది. నిందితుడు ప్రస్తుతం దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా రేపు (శనివారం) ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు దేశవ్యాప్తంగా అత్యవసర సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ బుధవారం ఆసుపత్రిని సందర్శించింది. ప్రశ్నించాల్సి ఉందంటూ ఐదుగురు వైద్యులకు సమన్లు ఇచ్చింది. మరోవైపు, ఈ కేసులోని ప్రధాన నిందితుడైన సంజయ్‌రాయ్ భార్య కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అతడు తనపై దాడిచేసినట్టు అందులో పేర్కొంది. కాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఎమర్జెన్సీ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌ను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించిన కేసులో కోల్‌కతా పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :