Thursday, 05 December 2024 03:26:26 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Nirmala Sitharaman: ఆ విషయంలో రాష్ట్రాలన్నీ కలిసి రావాలి: నిర్మలా సీతారామన్

Date : 27 July 2024 11:20 AM Views : 59

Studio18 News - జాతీయం / : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంధనం వస్తు సేవల పన్ను కింద ఉంది. అయితే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో కలిసి వస్తే జీఎస్టీ కిందకు వస్తుందని, అప్పుడు వాటి ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నారు. ధరను ఫిక్స్ చేసి, అందరూ కలిసి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని నిర్ణయించుకుంటే తాము దానిని వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో చేర్చేందుకు అవసరమైన నిబంధనలను ఇప్పటికే రూపొందించామన్నారు. జీఎస్టీ కౌన్సిల్ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే పరిస్థితులు ఉంటాయని, అందుకే రాష్ట్రాలు ఇందుకు సుముఖత చూపడం లేదన్నారు. కానీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు జీఎస్టీ ఒక పరిష్కారంగా కనిపిస్తోందని నిర్మలమ్మ అన్నారు. ఎందుకంటే ఇది పన్ను మీద పన్ను భారం లేకుండా చూస్తుందన్నారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదు కేంద్ర బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్‌లను మాత్రమే బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను ఆమె తోసిపుచ్చారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మాదిరే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని, ఏ ఒక్క రాష్ట్రానికీ నిధులను నిరాకరించలేదన్నారు. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :