Thursday, 05 December 2024 08:21:01 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

యుద్ధాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు: నితిన్ గడ్కరీ

Date : 29 August 2024 05:29 PM Views : 35

Studio18 News - జాతీయం / : Nitin Gadkari on Road Accidents: మనదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఎలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా? యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, మతపరమైన అల్లర్లలో ఎక్కువ మంది చనిపోతున్నారని మీరకుంటే.. పొరబడినట్టే. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన FICCI రోడ్ సేఫ్టీ అవార్డ్స్, కాన్క్లేవ్ 2024లో ఆయన విస్మయకర వాస్తవాలను బయటపెట్టారు. మనదేశంలో ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయని.. 3 లక్షల మంది వరకు క్షతగాత్రులవుతున్నారని తెలిపారు. బాధితుల్లో దాదాపు 65 శాతం మంది యువకులు, మహిళలలే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జీడీపీలో దాదాపు మూడు శాతం నష్టం వాటిల్లుతోందని వివరించారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిందే.. చైనా లేదా పాకిస్థాన్ యుద్ధాలు కావచ్చు, నక్సల్స్ దాడులు, మతపరమైన అల్లర్లు.. శాంతిభద్రతలకు విఘాతం ఘటనల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే ప్రమాదాలు జగినప్పుడు డ్రైవర్లను నిందిస్తుంటారని, కానీ రోడ్లు సరిగా లేకపోవడం వల్లే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. అన్ని రహదారులపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇంజనీరింగ్ లోపాలతో రహదారుల నిర్మాణం నాసిరకంగా జరుగుతోందని, సరైన ప్రణాళికలు కూడా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో రహదారుల నిర్మాణంలో ప్రమాణాలు కొరవడుతున్నాయని వాపోయారు. హనుమంతుడి తోకలా బ్లాక్ స్పాట్స్ ప్రభుత్వం వైపు నుంచి లోపం ఉందని, తక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్లు ఇస్తున్నారని.. దీంతో నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలు వెతుకుతున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్.. హనుమంతుడి తోకలా పెరిగిపోతూనే ఉన్నాయని గడ్కరీ ఆవేదన చెందారు. 2001లో తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ఆ దుర్ఘటన కారణంగా రెండేళ్ల జీవితాన్ని కోల్పోయానని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేన్ డిసిప్లేన్ ఫాలో కావాలని ఆయన సూచించారు. అంబులెన్స్ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ రోడ్డు ప్రమాద బాధితులను త్వరగా రక్షించేందుకు అంబులెన్స్ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. యాక్సిడెంట్ సమయంలో వాహనాల్లో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసేందుకు.. కట్టర్లు వంటి అధునాతన యంత్రాలను ఉపయోగించడంలో అంబులెన్స్ డ్రైవర్లకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. అలాగే ఆపద సమయాల్లో ఆదుకునే అంబులెన్స్‌ల‌ కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పెషల్ కోడ్‌లను సిద్ధం చేస్తోందని గడ్కరీ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :