Studio18 News - జాతీయం / : రివర్ క్రాసింగ్ ఎక్సెర్ సైజ్ చేస్తుండగా ప్రమాదం నదిలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహం నీటిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు
Also Read : ఇంటి ప్రధాన ద్వారంపై వినాయకుడి చిత్రాన్ని ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది?
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ లో ఘోరం చోటుచేసుకుంది. ఎల్ఏసీ వద్ద యుద్ధ ట్యాంకులో శిక్షణ పొందుతున్న ఐదుగురు సైనికులు దుర్మరణం పాలయ్యారు. రివర్ క్రాసింగ్ ఎక్సర్ సైజ్ చేస్తుండగా ఈ ఘోరం జరిగిందని అధికారవర్గాల సమాచారం. మరణించిన వారిలో ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సరిహద్దులకు సమీపంలో ఓ నది దాటుతుండగా టీ-72 యుద్ధ ట్యాంకు ప్రమాదానికి గురైందని, అందులో ఉన్న ట్రైనీ సోల్జర్లు, ఓ జేసీవో చనిపోయారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ట్రైనింగ్ లో భాగంగా టీ-72 యుద్ధ ట్యాంకులో ఓ జేసీవో, మరో నలుగురు సైనికులు నది దాటేందుకు ప్రయత్నించారు. అయితే, సడెన్ గా ఎగువ నుంచి వరద రావడంతో నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ట్యాంకు కొట్టుకుపోయింది. ట్యాంకుతో పాటు అందులోని సోల్జర్లు గల్లంతయ్యారు. సోల్జర్లు బతికిబయటపడే అవకాశంలేదని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) కు సమీపంలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Admin
Studio18 News