Monday, 16 September 2024 05:51:21 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Supreme Court: ముఖ్యమంత్రులు రాజులేం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Date : 05 September 2024 11:35 AM Views : 28

Studio18 News - జాతీయం / : రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, కీలక అధికారుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్‌గా ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని నియమించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని సుప్రీంకోర్టు గట్టిగా మందలించింది. ప్రభుత్వాధినేతలైన ముఖ్యమంత్రులు తమనుతాము పూర్వకాలంలో రాజులు మాదిరిగా భావించుకోవద్దని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మనం భూస్వామ్య యుగంలో లేమని, ముఖ్యమంత్రి అయినంత మాత్రనా ఏమైనా చేయగలరా? అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. మన దేశంలో జన విశ్వాస సిద్ధాంతం లాంటిది ఉందని, కార్యనిర్వాహక అధిపతులుగా ఉన్న సీఎం పాత రోజుల్లో రాజుల మాదిరిగా వ్యవహరించకూడదని పేర్కొంది. బాధ్యతలు అప్పగించిన ఐఎఫ్ఎస్ అధికారిపై శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉందని, అలాంటి అధికారిపై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ ఎందుకని బెంచ్ ప్రశ్నించింది. డెస్క్ ఆఫీసర్, డిప్యూటీ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి ఇంతమంది అభిప్రాయాలతో ముఖ్యమంత్రి విభేదిస్తున్నారంటే కారణం ఉండే ఉంటుందని, ఆయన మనసులో వేరే దరఖాస్తు ఉండొచ్చని, అందుకే ఆయన విభేదిస్తున్నారేమోనని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా సెప్టెంబర్ 3న సదరు అధికారి నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు ధర్మాసనానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. కాగా సీఎం పుష్కర్ ధామీ నియమించిన సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి రాహుల్‌పై క్రమశిక్షణా చర్యలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఆయనను రాజాజీ టైగర్ రిజర్వ్‌ అధికారిగా నియమించకూడదని నోట్‌లో పేర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి లెక్కచేయలేదు. దీంతో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :