Monday, 16 September 2024 05:26:14 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

కుంభవృష్టికి ఎగిరే నదులే కారణమా.. ప్రకృతి అందాలను ముంచేస్తున్నది ఫ్లయింగ్ రివర్లేనా?

Date : 06 August 2024 01:23 PM Views : 146

Studio18 News - జాతీయం / : flying rivers: వేడెక్కుతోన్న సముద్రాలు.. వెంటాడుతోన్న ముప్పు.. ప్రకృతి ప్రకోపం ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియడం లేదు. ఏ ప్రాంతాన్ని ఎప్పుడు ఏ వాతావరణ ముప్పు చుట్టుముడుతుందో అంతుచిక్కడం లేదు. ప్రళయం సృష్టించే విధ్వంసం మాత్రం అంతులేని నష్టాన్ని మిగులుస్తుంది. అనుకోకుండా మబ్బులు కమ్మేసి.. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసి..ఎత్తున ఉన్న ప్రదేశాలను కూడా నీళ్లు ముంచెత్తున్నాయి. అనుకోకుండా ఆకాశగంగ భూమి మీదకు వచ్చి.. పల్లె, పట్టణం అని తేడా లేకుండా అన్నింటిని తుడిచేస్తుంది. గంటల వ్యవధిలోనే కుండపోత వర్షం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. అసలు క్లౌడ్ బరస్ట్‌కు రీజన్ ఏంటనే దానిపై ఎన్నో చర్చలు ఉన్నాయి. మేఘాలు పగిలిపోయినట్లు ఉన్నట్లుండి.. ఒక్కసారిగా ఏడాదిలో కురిసే వర్షమంతా గంటల్లోనే కురవడానికి ఫ్లయింగ్ రివర్లే కారణమంటున్నారు సైంటిస్టులు. ఆకాశంలో ఎగిరే నదులు ఉన్నాయని.. వాటి వల్లే క్లౌడ్ బరస్ట్ జరుగుతందని చెబుతున్నారు. ఆకాశంలో నదులు ఏంటి.. వాటి వల్ల కుంభవృష్టి వర్షాలు ఏంటన్నదానిపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. ఆ పరిశోధనల్లో ఊహకందని విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూమి మీదున్న నీళ్లు ఆవిరై.. ఈ మధ్య దేశంలోని చాలా ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. లేటెస్ట్‌గా వయనాడ్ ప్రళయం అయితే వందలమంది ప్రాణాలను బలితీసుకుంది. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ వేలాదిమందిని సేఫ్‌గా కాపాడాల్సి వచ్చింది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్నట్లుండి వర్షాలు పడటానికి క్లౌడ్ బరస్టే కారణమని అంటున్నారు వెదర్ ఎక్స్‌పర్ట్స్. భూమి మీదున్న నీళ్లు ఆవిరై ఆకాశంలో నదిలాగా ఓ లేయర్ ఏర్పడి. ఒక్కసారిగా వర్షం రూపంలో కుంభవృష్టి వర్షానికి దారి తీస్తున్నాయని చెప్తున్నారు సైంటిస్ట్‌లు. గ్లోబల్ వార్మింగ్. అంటే భూమి వేడెక్కడం. రానురాను భూతాపం పెరిగి.. తేమశాతం పడిపోతోంది. భూమి మీదన్న నీళ్లు ఆవిరై ఆకాశంలో పాయలు ఏర్పడుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. వీటినే ఆకాశ నదులు లేక ఫ్లయింగ్ రివర్స్ అంటున్నారు. సముద్రాల్లోని నీరు వేడెక్కి పెద్దమొత్తంలో ఆవిరిగా మారి, ఆకాశంలో కంటికి కనిపించకుండా పాయలుగా ఫామ్ అవుతున్నాయి. ఆకాశంలోని దిగువ భాగంలో ఈ నీరు పట్టీగా ఏర్పడి.. వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు కదులుతూ అక్కడక్కడ ఒక్కసారిగా వర్షంగా లేదా మంచుగా కురుస్తుంది. అది కాస్త భారీ వరదలకు, మంచుచరియలు విరిగిపడి విధ్వంసానికి కారణమవుతుంది. భారతదేశంలో 574 ఆకాశ నదులు భారత్‌లో హిందూ మహాసముద్రం వేడెక్కి.. ఆకాశంలో ఫ్లయింగ్ రివర్లు ఏర్పడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వచ్చే రుతుపవనాల ప్రభావాన్ని పెంచుతున్నాయని అంటున్నారు వాతావరణ నిపుణులు. 2023 నేచర్ జర్నల్‌ ప్రకారం 1951- 2020 మధ్య భారతదేశంలో మొత్తం 574 ఆకాశ నదులు ఏర్పడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో ఏర్పడిన అత్యంత భారీ ఫ్లయింగ్ రివర్లు 80 శాతం వరదలకు కారణమయ్యాయి. 1985- 2020 మధ్య రుతుపవనాల సమయంలో భారత్‌లో వచ్చిన 10 అత్యంత భారీ వరదలకు ఇలాంటి 7 ఫ్లయింగ్ రివర్స్‌కి సంబంధం ఉన్నట్లు స్టడీస్‌లో తేలింది. ఈ మధ్యకాలంలో అయితే..హిందూ మహాసముద్రం నుంచి నీరు ఆవిరిగా మారి.. ఫ్లయింగ్ రివర్లుగా ఏర్పడటం భారీగా పెరిగిపోయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :