Thursday, 12 March 2026 04:03:45 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

మొన్న చెప్పుతో కొట్టింది.. ఈ రోజు కాళ్లు పట్టుకుంది.. వీడియో ఇదిగో!

Date : 02 June 2025 12:11 PM Views : 373

Studio18 News - జాతీయం / : కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ ను మహిళ చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటోను తన పాదం పై నుంచి నడిపాడని పంఖూరి మిశ్రా అనే మహిళ ఆరోపించింది. దీంతో ఆటో డ్రైవర్ ను హిందీలో దూషించింది. ఇదంతా ఫోన్ లో రికార్డు చేస్తున్నాడని ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టింది. ఈ వీడియోను ఆటో డ్రైవర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. బెంగళూరు పోలీసులు స్పందించి ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో మిశ్రాను అరెస్టు చేశారు. శనివారం ఈ ఘటన జరగగా ఆదివారం మిశ్రాను అరెస్టు చేశారు. ఆపై స్టేషన్ బెయిల్ మీద విడుదల చేశారు. తాజాగా సోమవారం మిశ్రా తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ కాళ్లు మొక్కుతూ క్షమించమని వేడుకుంది. అసలేం జరిగిందంటే.. శనివారం పంఖూరి మిశ్రా తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఓ ఆటో వారికి డాష్ ఇచ్చింది. ఆటో చక్రం తన పాదంపై నుంచి వెళ్లిందని ఆరోపిస్తూ మిశ్రా ఆటో డ్రైవర్ తో వాదనకు దిగింది. ఆమె హిందీలో మాట్లాడుతుండడంతో ఆటో డ్రైవర్ లోకేశ్ తన ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో ఆగ్రహించిన మిశ్రా.. లోకేశ్ పై చెప్పుతో దాడి చేశారు. "వీడియో తీస్తావా? తీసుకో" అంటూ హిందీలో మాట్లాడుతూ ఆమె పలుమార్లు డ్రైవర్‌ లోకేశ్ ను కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ, డ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఆమె భర్త ద్విచక్ర వాహనంపైనే కూర్చుని ఘటనను రికార్డ్ చేయడం గమనార్హం. అయితే, మిశ్రా ఆరోపణలను ఆటో డ్రైవర్ లోకేశ్ ఖండించాడు. ఈ ఘటనలో తన తప్పేమీలేదని, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఎవరిది తప్పో తెలుస్తుందని ఆయన అన్నారు. మిశ్రా హిందీలో మాట్లాడడంతో ఆమె భాష తనకు అర్థం కాక వీడియో తీశానని వివరణ ఇచ్చాడు. కాగా, స్టేషన్ బెయిల్ పై విడుదలైన తర్వాత మిశ్రా దంపతులు లోకేశ్ దంపతులను కలిసి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పారు. "క్షమించండి. నేను గర్భవతిని. ఒకవేళ గర్భస్రావం అవుతుందేమోననే భయం వల్లే అలా ప్రవర్తించాను" అని మిశ్రా అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :