Sunday, 25 January 2026 04:52:00 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Omar Abdullah: జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దు: ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి

Date : 08 October 2024 01:34 PM Views : 411

Studio18 News - జాతీయం / : జమ్మూ కశ్మీర్‌లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ దూసుకెళుతోంది. ఇక్కడ కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 52 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 28, పీడీపీ 2 సీట్లలో ముందంజలో ఉన్నాయి. ఈ క్రమంలో ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో తమ విజయం ఖాయమని తెలిపారు. జమ్మూ కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని, అయితే ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండాలన్నారు. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి ట్రిక్స్‌ను ప్లే చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దని సూచించారు. ఒమర్ అబ్దుల్లా గండేర్బల్, బుడ్గామ్... రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రెండుచోట్ల కూడా ఆయనే ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ బోణీ కొట్టింది. బండీపురా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి నజీర్ అహ్మద్ 1,132 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ కోసం, తన కోసం పని చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ బీజేపీ ఓటమి కేవలం ఆ పార్టీది మాత్రమే కాదని, నరేంద్రమోదీది కూడా అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :