Wednesday, 10 December 2025 02:01:25 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Dharam Singh Chhoker: 400 కోట్ల కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పుత్రరత్నం.. ఖరీదైన కారులో తిరుగుతూ తండ్రి కోసం ఎన్నికల ప్రచారం!

Date : 04 October 2024 03:16 PM Views : 287

Studio18 News - జాతీయం / : చట్టం అందరికీ ఒకటే కాదని మరోమారు రుజువైంది. రూ. 400 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్ కుమారుడు సికందర్ ఫ్యాన్సీ కారులో హర్యానా రోడ్లపై తిరుగుతూ కనిపించడం దుమారం రేపుతోంది. అనారోగ్యం సాకుతో ఆసుపత్రిలో చేరి ఆపై అక్కడి నుంచి బయటకు వచ్చి తండ్రి కోసం ఎన్నికల ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. ఖరీదైన కారులో తిరుగుతూ, సెల్‌ఫోన్ వాడుతూ బయట రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ. 400 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై సికందర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి రోహ్‌తక్‌లోని పీజీఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడతడికి కాపలాగా ఉండాల్సిన పోలీసులు అడ్రస్ లేకుండా పోయారు. ప్రతిరోజూ దర్జాగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి హర్యానా వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అతడి వద్ద ఫోన్ కూడా అందుబాటులో ఉంది. హర్యానాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాడు. రూ. 400 కోట్ల కుంభకోణంలో ఎమ్మెల్యే ధరమ్‌సింగ్, ఆయన కుమారుడు సికందర్ ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. ఇద్దరిపైనా ఈడీ కేసు నమోదు చేసింది. ఎమ్మెల్యే చోకర్‌కు హర్యానా-పంజాబ్ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు, సికందర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాతి నుంచి అతడు అనారోగ్య కారణంతో జైలు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. బెయిులు తిరస్కరణకు గురయ్యాకు రెండుసార్లు పీజీఐ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ తండ్రి కోసం ప్రచారం చేస్తున్నాడు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక ఫార్చ్యూనర్ కారును నడిపాడని, ఒక హోటల్‌లో నిద్రపోయాడని, పార్టీ కూడా చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ వార్తలతో అప్రమత్తమైన ఈడీ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :