Saturday, 24 January 2026 08:27:06 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఆ ప్రకటనపై భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి : పీయూష్‌ గోయల్‌

ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చేసిన ప్రకటనపై భారత్‌కు, అమెరి

Date : 02 June 2025 01:23 PM Views : 305

Studio18 News - జాతీయం / : ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చేసిన ప్రకటనపై భారత్‌కు, అమెరికాకు (India-US) మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) చెప్పారు. ఈ ఒప్పందం విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చల్లో పాల్గొన్న సమయంలోనూ మాట్లాడుకున్నారని తెలిపారు. వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయని గోయల్‌ చెప్పారు. ఈ సమస్యను ఇరుదేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయన్నారు. ఇరుదేశాల మధ్య ప్రతిపాదిత, మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్‌ను సందర్శించనుందని తెలిపారు. జూన్ చివరికి ఇరుదేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గత నెలలో వాషింగ్టన్‌లో అధికారులతో చర్చలు జరిపారని గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో అధికారిక పర్యటనలో ఉన్న గోయల్‌ ఆ దేశంతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంచుకోవడానికి అక్కడి నాయకులు, వ్యాపార ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంపై ఉన్న 25 శాతం సుంకాలను జూన్ 4 నుంచి రెట్టింపు చేస్తామని ఇటీవల ట్రంప్‌ ప్రకటించారు. అయితే దీనివల్ల భారతీయ ఆటో మొబైల్‌-భాగాల ఉత్పత్తుల ఎగుమతిదారులపై, ఉక్కు పరిశ్రమల రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. దాంతో అగ్రరాజ్యానికి చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని భారత్‌ ప్రపంచ వ్యాణిజ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. భారత స్టీల్‌, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ వ్యాణిజ్య సంస్థ యూఎస్‌కు నోటీసులు పంపగా వాటిని అగ్రరాజ్యం తిరస్కరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :