Monday, 30 March 2026 02:53:17 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

అమెరికా మా షరతులకు అంగీకరిస్తేనే యుద్ధం ఆగుతుంది: ఇరాన్

Date : 24 March 2026 12:08 PM Views : 8

Studio18 News - జాతీయం / HYDERABAD : అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలపై పక్కా ప్రణాళికతో చేయాలనుకున్న సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, అమెరికా మెత్తబడినప్పటికీ ఇరాన్ మాత్రం తన వైఖరిని స్పష్టం చేసింది. తమపై విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేసి, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని స్ప‌ష్టం చేసింది. సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. "గత రెండు రోజులుగా ఇరాన్‌తో జరిపిన చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయి. ఈ చర్చల స్ఫూర్తితో ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేపట్టాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని ఆదేశించాను" అని ట్రంప్ పేర్కొన్నారు. చర్చల పురోగతిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ స్పందించారు. 'న్యూస్18' కథనం ప్రకారం... "మాపై విధించిన ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసి, మాకు జరిగిన నష్టాన్ని పరిహారంగా చెల్లించే వరకు యుద్ధం కొనసాగుతుంది" అని ఆయన అన్నారు. అంతేగాక‌ ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోదని అంతర్జాతీయ హామీ కూడా కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన ప్రక్రియ సంక్లిష్టంగానే ఉందని స్పష్టమవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :