Sunday, 08 March 2026 10:11:58 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఏకైక మృత్యుంజయుడు రమేశ్ ను ప్రత్యేకంగా కలిసిన మోదీ

Date : 13 June 2025 01:09 PM Views : 402

Studio18 News - జాతీయం / : అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నిన్న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో పర్యటించి, ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ, నేరుగా మేఘానీనగర్‌లోని ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యల పురోగతిని అధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం, ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాశ్ కుమార్ రమేశ్‌ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా నిన్న మోదీ పేర్కొన్నారు. "ఈ విషాదం మాటలకు అందనిది. ఈ దుఃఖ సమయంలో, బాధితులందరి గురించి నా ఆలోచనలు ఉన్నాయి. బాధితులకు సహాయం చేయడానికి మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను" అని ఆయన తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :