Monday, 30 March 2026 02:56:47 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Rahul Gandhi: అమెరికా ఒత్తిడికి మోదీజీ త‌లొగ్గారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: అమెరికా, భార‌త్ మ‌ధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్ర‌ధాని మోదీ అమ్ముడుపోయిన‌ట్లు పేర్కొన్నారు.

Date : 03 February 2026 08:32 PM Views : 113

Studio18 News - జాతీయం / : న్యూఢిల్లీ: అమెరికా, భార‌త్ మ‌ధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్ర‌ధాని మోదీ అమ్ముడుపోయిన‌ట్లు పేర్కొన్నారు. ట్రంప్ వ‌త్తిడికి మోదీ త‌లొగ్గిన‌ట్లు ఆరోపించారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో రిపోర్ట‌ర్ల‌తో రాహుల్ మాట్లాడారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసు వ‌ల్ల ప్ర‌ధాని మోదీ తీవ్ర వ‌త్తిడిలో ఉన్న‌ట్లు ఆరోపించారు. అదానీపై అమెరికాలో కేసు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో కూడా మోదీ ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు రాహుల్ పేర్కొన్నారు. మోదీజీ భ‌య‌ప‌డుతున్నార‌ని, నాలుగు నెలలుగా వాణిజ్య ఒప్పందం స్తంభించింద‌ని, కొన్ని కార‌ణాల త‌ప్ప ఏమీ మార‌లేద‌ని, నిన్న సాయంత్రం ఒప్పందం కుదుర్చుకున్నార‌ని గాంధీ అన్నారు. న‌రేంద్ర మోదీపై తీవ్ర‌మైన వ‌త్తిడి ఉన్న‌ట్లు రాహుల్ తెలిపారు. మోదీ ఇమేజ్‌కు చెందిన బెలూన్ వేల కోట్ల‌తో తయారైంద‌ని, అది ఏ క్ష‌ణ‌మైనా పేలుతుంద‌ని ప్ర‌తిప‌క్ష నేత అన్నారు. మ‌న ప్ర‌ధాని అమెరికా వ‌త్తిడికి త‌లొగ్గార‌ని, భార‌త దేశ ప్ర‌జ‌లు దీని గురించి ఆలోచించాల‌ని, భార‌తీయ రైతులు ఆ డీల్ గురించి ఆలోచించాల‌ని, మీ శ్ర‌మ‌, ర‌క్తం, చ‌మ‌ట‌ను మోదీ అమ్మేస్తున్నార‌ని ఆరోపించారు. కేవ‌లం రైతులే కాదు. యావ‌త్ దేశాన్ని అమ్మేశార‌ని, అందుకే త‌న‌ను స‌భ‌లో మాట్లాడ‌నివ్వ‌డం లేద‌ని రాహుల్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :