Studio18 News - జాతీయం / : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రేంజ్ పరిధిలోని దంతెవాడ – నారాయణపుర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగి ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అబూజ్‌మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఆ సమయంలో వారిని చూసిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపడంతో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఆ ఏడుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Admin
Studio18 News