Sunday, 08 March 2026 04:33:55 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Vinesh Phogat: జులానా నుంచి మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గెలుపు

Date : 08 October 2024 04:47 PM Views : 414

Studio18 News - జాతీయం / : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై 6,015 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొదటి ఆరు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్‌లోనూ వినేశ్ ఫొగాట్ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఆరో రౌండ్ ముగిసే సమయానికి వినేశ్ ఫొగాట్ 1,200 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అయితే 7వ రౌండ్‌లోకి వచ్చేసరికి వినేశ్ ఫొగాట్ 38 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆమె మెజార్టీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. కాగా, జులానా అసెంబ్లీ స్థానంలో వినేశ్ ఫోగాట్ గెలవడం ఓ విశేషమైతే, ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ 19 ఏళ్ల తర్వాత చేజిక్కించుకోవడం మరో విశేషం. వినేశ్ ఫొగాట్ విజయం సాధించడంతో మరో రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. విజయం సాధించిన భారత పుత్రిక వినేశ్ ఫొగాట్‌కు అభినందనలు... ఇది కేవలం జులానా సీటుకు సంబంధించిన పోటీ కాదు, అలాగే మూడు నాలుగు పార్టీల మధ్య పోరు కాదని పేర్కొన్నారు. ఈ పోరు బలమైన అణిచివేతశక్తులతో జరిగిన పోరు అని పేర్కొన్నారు. ఈ పోరులో వినేశ్ ఫొగాట్ గెలిచిందని రాసుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :