Wednesday, 04 March 2026 09:26:22 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

West Bengal Hotels: బంగ్లాదేశ్ టూరిస్టులకు 'నో ఎంట్రీ'.. బెంగాల్ హోటళ్ల సంచలన నిర్ణయం!

Date : 26 December 2025 07:29 PM Views : 240

Studio18 News - జాతీయం / : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై పశ్చిమ బెంగాల్‌లో నిరసన బంగ్లాదేశ్ పర్యాటకులకు హోటళ్లలో బస నిరాకరిస్తున్న సంఘాలు డార్జిలింగ్, మాల్దా జిల్లాల హోటల్ యజమానుల ఏకగ్రీవ నిర్ణయం మైనారిటీలపై దాడులను తీవ్రంగా ఖండించిన హోటళ్ల సంఘాలు బంగ్లాదేశ్‌లో హిందూ గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల హోటళ్ల సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకులకు తమ హోటళ్లు, లాడ్జీలలో బస కల్పించబోమని ఈరోజు ప్రకటించాయి. మహమ్మద్ యూనస్ పాలనలో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాయి. బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న డార్జిలింగ్, మాల్దా జిల్లాల హోటల్ యజమానుల సంఘాలు ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. "మా సంఘంలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా బంగ్లాదేశ్ పర్యాటకులకు గదులు కేటాయించకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం మా జిల్లాలోని ఏ హోటల్‌లోనూ బంగ్లాదేశ్ టూరిస్టులు లేరు" అని మాల్దా హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణేందు చౌదరి తెలిపారు. వైద్య వీసాలపై చికిత్స కోసం వచ్చేవారికి ఈ నిషేధం వర్తింపజేయాలా? వద్దా? అనే అంశంపై త్వరలో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. అయితే, డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి హోటలియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించింది. వైద్య, విద్యార్థి వీసాలపై వచ్చే బంగ్లాదేశీయులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని ఆ సంఘం కార్యదర్శి ఉజ్వల్ ఘోష్ స్పష్టం చేశారు. "సిలిగురి కారిడార్‌పై బంగ్లాదేశ్ నేతలు సున్నితమైన వ్యాఖ్యలు చేయడం, హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రస్థాయికి చేరడం ఆమోదయోగ్యం కాదు" అని ఆయన అన్నారు. ఈ రెండు సంఘాల నిర్ణయానికి స్థానిక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో దైవదూషణ ఆరోపణలతో 25 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను ఫ్యాక్టరీ నుంచి బయటకు లాక్కొచ్చి, కర్రలతో కొట్టి చంపి, చెట్టుకు కట్టేసి నిప్పంటించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :