Thursday, 12 March 2026 01:31:00 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు

Date : 07 February 2026 07:31 PM Views : 127

Studio18 News - క్రీడలు / : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఉత్కంఠభరిత విజ‌యం నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు ఆఖ‌ర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించిన ఫహీమ్ టీ20 ప్రపంచకప్ 2026కు ఉత్కంఠభరిత ఆరంభం లభించింది. కొలంబో వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఓటమి ఖాయమనుకున్న దశలో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. 148 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47) శుభారంభం అందించాడు. అయితే, ఆ తర్వాత నెదర్లాండ్స్ బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. పాకిస్థాన్ విజయానికి చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఫహీమ్ అష్రాఫ్ క్రీజులో నిలిచి విధ్వంసం సృష్టించాడు. లోగాన్ వాన్ బీక్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో సమీకరణం పూర్తిగా మారిపోయింది. చివరి ఓవర్‌లో మరో ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఫహీమ్ కేవలం 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు పాక్ స్పిన్నర్లు నెదర్లాండ్స్‌ను 147 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టును పాక్ బౌలర్లు బెంబేలెత్తించారు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37, బాస్ డి లీడె 30 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లతో నెదర్లాండ్స్ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు. అలాగే, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్ రెండేసి వికెట్లు పడగొట్టి డచ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :