Tuesday, 10 March 2026 04:12:14 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Robin Uthappa: భారత జట్టులో చోటు దక్కాలంటే..!: రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు

Date : 07 January 2026 07:08 PM Views : 131

Studio18 News - క్రీడలు / : న్యూజిలాండ్ తో తలపడే జట్టులో రుతురాజ్ కు దక్కని చోటు ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో ప్రస్తావిస్తూ మండిపడ్డ ఊతప్ప ఆ మూడు నగరాల నేపథ్యం ఉన్న వారికే జట్టులో సుస్థిర స్థానమంటూ విమర్శలు భారత క్రికెట్ జట్టు ఎంపికపై మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప తీవ్ర విమర్శలు చేశారు. జట్టులో చోటు దక్కాలన్నా, జట్టులో సుస్థిర స్థానం పొందాలన్నా ముంబయి, ఢిల్లీ, పంజాబ్ నేపథ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. న్యూజిలాండ్ జట్టు భారత పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కకపోవడంపై రాబిన్ ఊతప్ప తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ లో రుతురాజ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ తో తలపడే భారత జట్టులో స్థానం దక్కకపోవడం నీకు జీర్ణించుకోలేని విషయమే. భారత క్రికెట్‌ లో ఉన్న సవాళ్లలో ఇదొకటి. ముంబయి, ఢిల్లీ, పంజాబ్‌ నేపథ్యంలేని ఆటగాళ్లు భారత జట్టులో సుస్థిర స్థానం పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది’ అని రాబిన్ ఊతప్ప అన్నారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో రుతురాజ్ సెంచరీ.. ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ల్లో రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం దక్కింది. మొదటి వన్డే మ్యాచ్ లో విఫలమైన రుతురాజ్.. రెండో వన్డేలో 83 బంతుల్లోనే సెంచరీ చేశాడు. విరాట్‌ కోహ్లీతో కలిసి 195 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మూడో వన్డేలో రుతురాజ్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :