Studio18 News - క్రీడలు / : PR Sreejesh – Paris Olympics 2024 : భారత పురుషుల హాకీ జట్టు మాజీ కెప్టెన్, గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ అభిమానులకు షాకిచ్చాడు. ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్ అవుతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదకగా తెలియజేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో శ్రీజేష్ భారత్ సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగం అయ్యాడు. అతడు ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 328 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌తో నా కెరీర్ ముగుస్తుంది. విశ్వక్రీడల్లో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా ప్రయాణంలో ఇప్పటి వరకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, సహచరులు, కోచ్‌లకు, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. సంతోషం, బాధ సమయాల్లో సహచరులు పక్కనే ఉన్నారు. మేమంతా పారిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. పతకంతో తిరిగొస్తామే నమ్మకం ఉంది.’ అని సోషల్ మీడియాలో శ్రీజేశ్ రాసుకొచ్చాడు.2010లో అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టిన శ్రీజేశ్.. ఒలింపిక్స్‌లో కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో అతడు సభ్యుడు. ఆసియా గేమ్స్ లో రెండు బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలిచిన జట్టులో భాగం అయ్యాడు. భారత హాకీకి శ్రీజేష్ చేసిన సేవలకు పలు అవార్డులు లభించాయి. అతనికి 2021లో దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డు లభించింది.
Admin
Studio18 News