Monday, 17 March 2025 05:12:41 PM
# Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు

Champions Trophy 2025: బాప్‌రేబాప్‌.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి వ‌చ్చిన మొత్తం వ్యూస్ తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే!

ఇటీవ‌ల దిగ్విజ‌యంగా ముగిసిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ పాకిస్థాన్‌, యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ మెగా ఈవెంట్‌ జియోహాట్‌స్టార్‌లో ప్ర‌సార‌మైన ఛాంపియ‌న్స్

Date : 13 March 2025 05:45 PM Views : 26

Studio18 News - క్రీడలు / : ఇటీవ‌ల పాకిస్థాన్‌, యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ దిగ్విజ‌యంగా ముగిసిన విష‌యం తెలిసిందే. పుష్క‌ర‌కాలం త‌ర్వాత మ‌రోసారి భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచింది. 2013లో ఎంఎస్‌ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ సాధించిన టీమిండియా... ఇప్పుడు మ‌రోసారి రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో ట్రోఫీని కైవ‌సం చేసుకుంది. మొత్తంగా మూడోసారి ఛాంపియ‌న్స్ ట్రోఫీని ద‌క్కించుకుంది భార‌త్‌. ఇక జియోహాట్‌స్టార్‌లో ప్ర‌సార‌మైన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌ వ్యూస్ ప‌రంగా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. భార‌త్‌, న్యూజిలాండ్ మ్యాచ్ ఏకంగా 90 కోట్ల‌కు పైగా వీక్ష‌ణలు ద‌క్కించుకోవ‌డం విశేషం. మ‌రి మొత్తం ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎన్ని వ్యూస్ వ‌చ్చాయో తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే. జాతీయ మీడియా స‌మాచారం ప్ర‌కారం భారీ ఆద‌ర‌ణ పొందిన‌ ఈ మెగా ఈవెంట్‌కు 540.3 కోట్ల వ్యూస్ రాగా... 11వేల కోట్ల నిమిషాల‌పాటు వాచ్‌టైమ్‌గా న‌మోదైంది. ఇది భార‌త్ (143 కోట్లు), చైనా (141 కోట్లు) జ‌నాభా కంటే రెట్టింపు కావ‌డం విశేషం. ఏక‌కాలంలో 6.2 కోట్ల వ్యూవ‌ర్స్ కూడా వీక్షించిన‌ట్లు తెలుస్తోంది. జియోహాట్‌స్టార్ డిజిట‌ల్ సీఈఓ కిర‌ణ్ మ‌ణి మాట్లాడుతూ... "ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భారీ ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కింది. కోట్ల మంది వీక్షించే అవ‌కాశం వ‌చ్చింది. భార‌త్‌-ఆసీస్ మ‌ధ్య తొలి సెమీస్ ఫైన‌ల్‌ మ్యాచ్ సంద‌ర్భంగా సింగిల్ డేలోనే అత్య‌ధిక స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌ను సాధించ‌డం జ‌రిగింది" అని అన్నారు. అలాగే హిందీ మాట్లాడే ప్రాంతాలు ఏకంగా 38 శాతం వీక్షణలను అందించాయ‌ని ఆయ‌న తెలిపారు. యూపీ, ఉత్త‌రాఖండ్, మ‌హారాష్ట్ర‌, గోవా, పంజాబ్‌, హ‌ర్యానా త‌దిత‌ర రాష్ట్రాల నుంచి భారీగా వ్యూస్ వ‌చ్చాయ‌న్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :