Sunday, 20 April 2025 02:03:24 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా

మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా

Date : 15 March 2025 04:52 PM Views : 49

Studio18 News - క్రీడలు / : మ‌రో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కు తెర‌లేవ‌నుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానుంది. బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడేందుకు ప్ర‌పంచ క్రికెట్ ఆట‌గాళ్లు ఎంతో ఉత్సుక‌త చూపిస్తుంటారనే విష‌యం తెలిసిందే. ఎందుకంటే ఇత‌ర దేశాల టీ20 లీగ్స్ కంటే ఐపీఎల్‌లో ఆడితే అధిక మొత్తం ప్లేయ‌ర్ల‌కు ద‌క్కుతుంది. ఇంకా చెప్పాలంటే రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు కావొచ్చు కూడా. ఇక 2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్ టోర్నీ ఈ ఏడాదితో 18వ సీజ‌న్‌లో అడుగు పెడుతోంది. ప్రస్తుతం ఈ టోర్నీ పది జట్లను కలిగి ఉంది. 2008 నుంచి 2022 వ‌ర‌కు ఎనిమిది జ‌ట్లు మాత్ర‌మే ఉన్నాయి. 2023లో రెండు కొత్త జ‌ట్లు చేరాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ), గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) చేర‌డంతో జ‌ట్ల సంఖ్య ప‌దికి చేరింది. కాగా, గ‌డిచిన 17 ఎడిష‌న్ల‌లో ఏ జ‌ట్లు విజేత‌గా నిలిచాయి, ఏ టీమ్ అత్య‌ధిక సార్లు టైటిల్ కైవ‌సం చేసుకుంది, అస‌లు ఐపీఎల్ ట్రోఫీ గెవ‌ల‌ని జ‌ట్లు ఏవీ? త‌దిత‌ర విషయాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 2008లో జ‌రిగిన ప్రారంభ సీజన్‌లో షేన్ వార్న్ సార‌థ్యంలోని రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టిన‌ విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌ ముంబ‌యి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు టైటిళ్లను గెలుచుకున్నాయి. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ మూడుసార్లు విజేత‌గా నిలిచింది. ఇక గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్ (ప్ర‌స్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్) ఒక్కో టైటిల్‌ గెలుచుకున్నాయి. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మాత్రం ట్రోఫీ గెల‌వ‌లేదు. టోర్నీ ప్రారంభ సీజ‌న్ నుంచి ఉన్న బెంగ‌ళూరు ప్ర‌తిసారి భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగి, చివ‌రికి ఒట్టిచేతుల‌తోనే వెనుదిరుగుతోంది. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గ‌జ ప్లేయ‌ర్‌ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ జ‌ట్టు ఈసారైనా టైటిల్ గెలుస్తుందేమో చూడాలి.

2008 నుంచి 2024 వ‌ర‌కు ఐపీఎల్ విజేత‌ల జాబితా ఇదే.. 2008- రాజస్థాన్ రాయల్స్ 2009- డెక్కన్ ఛార్జర్స్ 2010- చెన్నై సూపర్ కింగ్స్ 2011- చెన్నై సూపర్ కింగ్స్ 2012- కోల్‌కతా నైట్ రైడర్స్ 2013- ముంబ‌యి ఇండియన్స్ 2014- కోల్‌కతా నైట్ రైడర్స్ 2015- ముంబ‌యి ఇండియన్స్ 2016- సన్‌రైజర్స్ హైదరాబాద్ 2017- ముంబ‌యి ఇండియన్స్ 2018- చెన్నై సూపర్ కింగ్స్ 2019- ముంబ‌యి ఇండియన్స్ 2020- ముంబ‌యి ఇండియన్స్ 2021- చెన్నై సూపర్ కింగ్స్ 2022- గుజరాత్ టైటాన్స్ 2023- చెన్నై సూపర్ కింగ్స్ 2024- కోల్‌కతా నైట్ రైడర్స్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :