Thursday, 14 November 2024 06:21:05 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

Ravichandran Ashwin: కివీస్‌తో రెండో టెస్టు.. అశ్విన్‌ ఖాతాలో అరుదైన రికార్డ్!

Date : 24 October 2024 02:17 PM Views : 38

Studio18 News - క్రీడలు / : భారత సీనియర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ప్రస్తుతం పూణేలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు వికెట్లు పడగొట్టి ఈ ఫీట్‌ను సాధించాడు. కివీస్ కెప్టెన్ లాథ‌మ్ వికెట్ తీయ‌డంతో ఈ ఘన‌త అందుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 188 వికెట్లు ఉన్నాయి. దీంతో ఆసీస్ బౌల‌ర్ నాథన్ ల‌యన్ (187) ను అధిగ‌మించాడు. ఆ తర్వాతి స్థానాల్లో క‌మ్మిన్స్‌(175), మిచెల్‌ స్టార్క్(147), స్టువ‌ర్ట్‌ బ్రాడ్(134) ఉన్నారు. అశ్విన్ డ‌బ్ల్యూటీసీలో 74 ఇన్నింగ్స్‌లలో 20.75 సగటుతో 188 వికెట్లు సాధించాడు. ఇందులో ఐదు వికెట్ల హాల్ 11సార్లు న‌మోదు చేశాడు. మ‌రోవైపు ల‌య‌న్‌ 78 ఇన్నింగ్స్‌లలో 26.70 సగటుతో 187 వికెట్లతో 10 ఐదు వికెట్ల హాల్‌లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అశ్విన్ అతని కంటే 2,500 బంతులు తక్కువగా బౌలింగ్ చేసినప్పటికీ ల‌య‌న్‌ను అధిగ‌మించ‌డం విశేషం డ‌బ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు రవి అశ్విన్ (భారత్)- 188 నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా)- 187 పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 175 మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)-147 స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్)- 134 ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ విషయానికొస్తే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్టులో భార‌త్ ప‌రాజ‌యం పాలైంది. దీంతో ప్ర‌స్తుతం 0-1తో వెనుక‌బ‌డి ఉంది. ఈరోజు నుంచి పూణే వేదిక‌గా రెండో టెస్టు ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ తీసుకుంది. లంచ్ స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి 92 ప‌రుగులు చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :