Tuesday, 10 March 2026 04:12:16 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Ujjain Sadhus: ఐపీఎల్‌కు బంగ్లా హింస సెగ.. ముస్తాఫిజుర్ ఆడితే పిచ్‌లు తవ్వేస్తామన్న ఉజ్జయిని సాధువులు

Date : 27 December 2025 07:05 PM Views : 111

Studio18 News - క్రీడలు / : బంగ్లాలో హిందువులపై దాడులకు నిరసనగా ఐపీఎల్‌కు హెచ్చరిక బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ ఆడితే పిచ్‌లు తవ్వేస్తామన్న ఉజ్జయిని సాధువులు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం బంగ్లాలో ఇద్దరు హిందువుల దారుణ హత్యలతో పెరిగిన ఆగ్రహం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై పడింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌లో ఆడనిస్తే, మ్యాచ్‌లు జరిగే స్టేడియంలలోకి దూసుకెళ్లి పిచ్‌లను ధ్వంసం చేస్తామని ఉజ్జయినికి చెందిన పలువురు మత పెద్దలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువులను దైవదూషణ ఆరోపణలతో దారుణంగా హత్య చేసిన ఘటనలపై భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉజ్జయినిలోని రిన్‌ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రధాన పూజారి మహావీర్ నాథ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులను వేధిస్తున్నా, అక్కడి ఆటగాళ్లను భారత్‌లో ఆడనివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అవసరమైతే తమ నాగ సాధువులు స్టేడియంలపై దాడి చేసి మ్యాచ్‌లను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. ఇతర పీఠాధిపతులు కూడా ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ నుంచి వేలంలో అమ్ముడైన ఏకైక ఆటగాడు అతడే కావడం గమనార్హం. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో కేకేఆర్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ నెల‌ 18న బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని, 24న రాజ్‌బరీ జిల్లాలో అమృత్ మోండల్ అనే మరో హిందూ వ్యక్తిని మూకదాడుల్లో హత్య చేశారు. ఈ దాడులను ఖండించిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బంగ్లాలో హిందువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు సురక్షితంగా లేకపోతే, వారికి భారత్ ఆశ్రయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, నిందితుల్లో కొందరిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :