Monday, 16 March 2026 01:53:17 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Usman Khawaja: ఖవాజాకు ఘన వీడ్కోలు.. 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో గౌరవించిన ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు.. ఇదిగో వీడియో!

Date : 08 January 2026 07:19 PM Views : 142

Studio18 News - క్రీడలు / : చివరి మ్యాచ్ ఆడిన ఉస్మాన్ ఖవాజాకు గార్డ్ ఆఫ్ ఆనర్ మైదానాన్ని ముద్దాడి భావోద్వేగంతో వీడ్కోలు యాషెస్ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా గెలుపుతో కెరీర్ ముగించడం ఎంతో ఆనందంగా ఉందన్న ఖవాజా ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు భావోద్వేగాల మధ్య ఘనంగా వీడ్కోలు పలికాడు. తన చివరి మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి వస్తున్న అతనికి, ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇచ్చి అరుదైన గౌరవాన్ని అందించారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టు ఐదో రోజున ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత ఖవాజా క్రీజులోకి రాగా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వరుసలో నిలబడి అతనికి గౌరవ వందనం సమర్పించారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కరచాలనం చేసి ఖవాజా బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచి, యాషెస్ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. తన చివరి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటైన ఖవాజా, మైదానం వీడే ముందు మోకాళ్లపై కూర్చుని పిచ్‌ను ముద్దాడాడు. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేస్తూ భావోద్వేగంతో పెవిలియన్ చేరాడు. విజయం తర్వాత ఖవాజా మాట్లాడుతూ.. "గెలుపుతో కెరీర్‌ను ముగించడం ఎంతో సంతృప్తినిచ్చింది. సహచరులతో కలిసి ఈ విజయాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలని మాత్రమే కోరుకున్నాను. అదే జరిగింది" అని తెలిపాడు. తన చివరి మ్యాచ్‌లో భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపించిందని ఖవాజా అన్నాడు. "నా కెరీర్ మొత్తంలో ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నాను. కానీ, ఈ మ్యాచ్‌లో ఏకాగ్రతతో ఆడటం కష్టమైంది. అయినా గెలుపుతో ఎస్‌సీజీలో కెరీర్ ముగించడం జీవితాంతం గుర్తుండిపోతుంది" అని వివరించాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :