Tuesday, 03 December 2024 05:01:20 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

పెర్త్ టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం

పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ తొలి టెస్టు 295 ప‌రుగుల తేడాతో టీమిండియా గెలుపు 534 ప‌రుగుల భారీ లక్ష్యఛేద‌న‌లో 238 ర‌న్స్‌కే ఆసీస్ ఆలౌట్‌ అర

Date : 25 November 2024 02:21 PM Views : 58

Studio18 News - క్రీడలు / : బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన‌ తొలి టెస్టులో భార‌త జ‌ట్టు ఘ‌న‌ విజ‌యం సాధించింది. 534 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 238 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో టీమిండియా 295 ర‌న్స్ తేడాతో గెలిచింది. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 12/3తో నాలుగో రోజు ఆట కొన‌సాగించిన ఆసీస్ మ‌రో ఐదు ప‌రుగులు జోడించి ఉస్మాన్ ఖ‌వాజా వికెట్‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్ ద్వ‌యం కొద్దిసేపు భారత బౌల‌ర్ల‌ను నిలువరించింది. ఐదో వికెట్‌కు ఈ జోడి 62 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించింది. అయితే, మ‌హ్మ‌ద్‌ సిరాజ్ ఓ అద్భుత‌మైన బంతితో స్మిత్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్ర‌మంలోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత‌ మిచెల్ మార్ష్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రిగెత్తించాడు. 89 ప‌రుగులు చేసి సెంచ‌రీ వైపు దూసుకెళ్తున్న హెడ్‌ను బుమ్రా పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో మార్ష్‌, హెడ్ నెల‌కొల్పిన 82 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. అనంత‌రం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) వికెట్లను కోల్పోవ‌డంతో ఆసీస్ ఓట‌మి ఖాయ‌మైంది. చివ‌రికి ఆతిథ్య జ‌ట్టు 58.4 ఓవ‌ర్ల‌లో 238 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే వాషింగ్ట‌న్ సుంద‌ర్ 2, హ‌ర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి 8 వికెట్లతో (మొద‌టి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3) రాణించిన కెప్టెన్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా, ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త్ 0-1తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్టు వ‌చ్చే నెల 6 నుంచి 10వ తేదీ మ‌ధ్య అడిలైడ్‌లో జ‌ర‌గ‌నుంది. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌: 150, రెండో ఇన్నింగ్స్‌: 487/6 డిక్లేర్‌ ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌: 104, రెండో ఇన్నింగ్స్‌: 238

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :